V6 News

కేసీఆర్ ఇంటికి నీటి కొరతపై జలమండలి క్లారిటీ.. అసలు నిజం ఇదే..

కేసీఆర్ ఇంటికి నీటి కొరతపై  జలమండలి క్లారిటీ.. అసలు నిజం ఇదే..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి నీటి కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై హైదరాబాద్ జలమండలి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. 

నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి (కన్స్యూమర్ నెం: 612178979) ఎప్పటిలాగే సాధారణ షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా జరుగుతోంది. ఆ ప్రాంతంలో ప్రతి రోజూ విడిచి ఒక రోజు నీటిని అందిస్తున్నాం.కేసీఆర్ నివాసం వద్ద ఏదైనా సమావేశాలు లేదా మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే... వారి పర్సనల్ పీఏ అభ్యర్థన మేరకు అదనపు వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా వారి అవసరాలకు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం తప్ప, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కొరత ఏమీ లేదు.

 ఏప్రిల్ 24వ తేదీన స్టడీ సర్కిల్ వద్ద పైప్‌లైన్ చోక్ కావడం వల్ల స్వల్ప అంతరాయం ఏర్పడింది. అయితే యుద్ధ ప్రాతిపదికన స్పందించి అదే రోజు సమస్యను పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరించాం. నంది నగర్ ప్రాంతంలో నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేవని, ప్రజలు , నాయకులు వాస్తవాలను గమనించాలని జలమండలి స్పష్టం చేసింది.