కాంగ్రెస్​లో చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి

కాంగ్రెస్​లో  చేరిన కేంద్ర మాజీ  మంత్రి వేణుగోపాల చారి

నిర్మల్, వెలుగు:  బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి  కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వేణుగోపాలచారి మూడుసార్లు నిర్మల్ ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ , ఎంపీగా గెలుపొందారు.  ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు.

 దీంతోపాటు ఇటీవలే స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతులు నిర్వహించారు.  కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్న వేణుగోపాలచారి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమవుతోంది.