- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్కుమార్దీపక్అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యతో కలిసి అర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని షంషేర్ నగర్ స్కూల్ చెందిన లక్ష్మణరావు వాటర్ ట్యాంక్ కూల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని, మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన కోట లక్ష్మి తన కుమారుడికి గురుకుల సీటు ఇప్పించాలని, కొత్తూరు గ్రామ రైతులు బోనస్ డబ్బులు ఇవ్వాలని, తాండూర్ మండలం మాదారం గ్రామానికి చెందిన మహమ్మద్ ముజాహద్ హుస్సేన్ అక్రమ భూ పట్టాను రద్దు చేయాలని కలెక్టర్కు విన్నవించారు.
స్పందించిన ఆయన మాట్లాడుతూ.. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆఫీస్సబార్డినేట్లకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
