కన్నతల్లిని, జన్మ భూమిని, మాతృ భాషను మరిచిపోవద్దు

కన్నతల్లిని, జన్మ భూమిని, మాతృ భాషను మరిచిపోవద్దు

ఖైరతాబాద్, వెలుగు: భారతీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. బ్యాక్ టు రూట్స్ పేరుతో దేశ మూలాలకు వెళ్లాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీ నగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. చీఫ్ గెస్టుగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. స్టూడెంట్లు, అధ్యాపకులతో కాలక్షేపం చేయడం తనకు చాలా ఇష్టమన్నారు. రైతులతో మాట్లాడటం, సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతానని తెలిపారు.

కన్నతల్లిని, జన్మ భూమిని, మాతృ భాషను మరిచిపోవద్దని సూచించారు.  పిల్లలు తెలుగులో మాట్లాడేలా వారి తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం వీజేపీఎస్ స్కూల్ మేనేజ్ మెంట్ వెంకయ్య నాయుడును సత్కరించింది. వార్షిక వేడుకల్లో భాగంగా స్కూల్ స్టూడెంట్ల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వీజేపీఎస్ ప్రెసిడెంట్  డి. సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి  జె. శేషగిరిరావు, ఉపాధ్యక్షుడు కోడె దుర్గాప్రసాద్, వి. రాజశేఖర్, గోపాల్ రెడ్డి, స్టూడెంట్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.