
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్(36) కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సీఈవో పాల్ ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
స్టార్ బ్రే వ్యాట్ అసలు పేరు విందామ్ రోటుండా. అతను 2013లో 'రా' ప్రోగ్రామ్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలోకి అరంగేట్రం చేశాడు. గత కొన్ని నెలలుగా రెజ్లింగ్‌కు దూరంగా ఉన్న బ్రే వ్యాట్.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషాదఘటన చోటుచేసుకుంది.
బ్రే వ్యాట్ అకాల మరణం గురించి అతని కుటుంబ సభ్యులు తమకు వెల్లడించినట్లు ట్రిపుల్ హెచ్ తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వారి గోప్యతను గౌరవించాలని మేము కోరుతున్నామని ట్వీట్ చేశాడు.
Just received a call from WWE Hall of Famer Mike Rotunda who informed us of the tragic news that our WWE family member for life Windham Rotunda - also known as Bray Wyatt - unexpectedly passed earlier today. Our thoughts are with his family and we ask that everyone respect their…
— Triple H (@TripleH) August 24, 2023
బ్రే వ్యాట్ మరణం పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతటి అనుబంధం అతనిది. అండర్‌టేకర్ రింగ్‌పైకి వచ్చేటప్పుడు లైట్లన్నీ ఎలా ఆపేసేవారో.. బ్రే వ్యాట్ వచ్చే సమయంలోనూ అలాగే చేసేవారు. అప్పుడు బ్రే వ్యాట్ లాంతరు పట్టుకొని ఎంట్రీ ఇచ్చేవాడు. రింగ్‌లో అతని రెజ్లింగ్ స్కిల్స్ ఏమో కానీ.. బయట అతడు చేసే విన్యాసాలు మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకునేవి.
Bray Wyatt vs Undertaker Wrestlemania 31#RIPBrayWyatt pic.twitter.com/xOHyItUKsM
— Erwin Kouassi ⭐⭐ (@er_94) August 25, 2023