చెన్నై జట్టులోకి ఫారెస్టర్‌‌‌‌‌‌‌‌

చెన్నై జట్టులోకి ఫారెస్టర్‌‌‌‌‌‌‌‌

చెన్నై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–19లో గాయాలతో ఇబ్బందిపడుతున్న చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ కీలక నిర్ణయం తీసుకుంది. కుడి తొడ గాయంతో మెగా టోర్నీకి దూరమైన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ జెమీ ఓవర్టన్‌‌‌‌‌‌‌‌ స్థానంలో సౌతాఫ్రికా ప్లేయర్‌‌‌‌‌‌‌‌ డియాన్‌‌‌‌‌‌‌‌ ఫారెస్టర్‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ కమిటీ గురువారం దీనికి గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. 

సౌతాఫ్రికా తరఫున మార్చిలో అరంగేట్రం చేసిన ఫారెస్టర్‌‌‌‌‌‌‌‌ను రూ. 75 లక్షల బేస్‌‌‌‌‌‌‌‌ప్రైస్‌‌‌‌‌‌‌‌కే సీఎస్కే కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా తరఫున 5 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన ఫారెస్టర్‌‌‌‌‌‌‌‌ 83 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు ఓవర్టన్‌‌‌‌‌‌‌‌ బుధవారమే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వెళ్లాడని సీఎస్కే వెల్లడించింది.