కోతుల బెడదను నివారించే వారినే సర్పంచ్ గా ఎన్నుకోండి: పద్మనాభ రెడ్డి

కోతుల బెడదను నివారించే వారినే సర్పంచ్ గా ఎన్నుకోండి: పద్మనాభ రెడ్డి

కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్ లు గ్రామాల్లో  కోతుల బెడదను అరికట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మనాభరెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియాఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 

మనుషులకు జనాభా లెక్కలు ఉన్నాయి కానీ, కోతులకు జనాభా లెక్కలు అంచనా వేయడం లేదని అన్నారు. కోతులు కొరకడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల లక్షల్లో కేసులు నమోదవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కోతులను నివారించడంలో కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అడవులను నరకడం వల్లనే, కోతులు గ్రామాల్లోకి వచ్చి  పంటలను నష్టం చేయడమే గాక,  ఇండ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నాయని అని వారు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో కోతులకు స్టెరిలైజేషన్ చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ విభాగాలు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని కోతులను జూలకు పారదోయోలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

►ALSO READ | అక్కడ మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటారు..ఏ దేశం? ఎందుకా పరిస్థితి వచ్చింది?

కోతుల బెడద వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 50 వేల కోట్ల నుండి లక్ష కోట్ల వరకు ప్రజలకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. ప్రభుత్వం కోతుల బెడదపై  ఒక డేడికేటెడ్ కమిటీని ఏర్పాటుచేసి పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. కోతుల విషయమై రాష్ట్రస్థాయిలో శాస్త్రీయంగా సర్వే జరగడం లేదని అన్నారు. ఒక కోతి సంరక్షణకు వంద రూపాలు ఖర్చు వస్తుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే రిహాబిలేషన్ సెంటర్  ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక కోతుల బెడదపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు.