అక్కడ మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటారు..ఏ దేశం? ఎందుకా పరిస్థితి వచ్చింది?

అక్కడ మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటారు..ఏ దేశం? ఎందుకా పరిస్థితి వచ్చింది?

అక్కడ మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటారు.. గంటలు రోజుల లెక్కన మెగుళ్లను  రెంట్ కు తీసుకుంటారు.ఇంటిపనులు, ఇతర పనులకు వీరిని ఉపయోగించుకుంటున్నారు. ఇక భర్తలను అద్దెకిచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. వారి వ్యాపారం జోరుగా సాగుతోంది.. ఈ విచిత్రమైన తంతు  లేదా పరిస్థితి ఏదేశంలో ఉంది.. ఎందుకు భర్తలను రెంట్ తీసుకోవాల్సి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. 

యూరప్ దేశమైన చాత్వియాలో పెండ్లి కాని పురుషులకు మస్తు డిమాండ్ ఉంది. మగవాళ్లకంటే ఆడవాళ్ల జనాభా ఎక్కువ ఉందట ఆ దేశంలో.. ఈ కారణంతో  అమ్మాయిలకు ఈడు వచ్చినా తోడు దొరక్క అల్లాడిపోతున్నారట. పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలే కరువయ్యారు. దీంతో ఇంటిపనులు, ఇతర పనులకోసం  భర్తలను అద్దెకు తెచ్చుకున్నారని న్యూయార్క్ పోస్ట్  ఓ పెద్ద సోర్టీ రాసింది. 

ఆ పత్రిక కథనం ప్రకారం.. ఆ దేశంలో పురుషుల కన్నా మహిళల జనాభా25.5 శాతం ఎక్కువ. ఇది యూరోపియన్ యూనియన్ లో సగటు కన్నా మూడు రెట్లు ఎక్కువ. ఇక 65 అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో పురుషుల కన్నా మహిళలు రెండు రెట్లు ఎక్కువట. పని ప్రదేశాలలో, రోజువారీ జీవి తంలో పురుషుల కొరత స్పష్టంగా కన్పిస్తుందంటున్నారు. దేశంలో పురుషుల కొరత తీవ్రంగా ఉండటంతో భాగస్వామికోసం మహిళలు విదేశాలకు కూడా వెళ్లిపోతున్నారు.  

ఇక అలా చేయలేని వారు భర్తలను గంటలు, రోజుల లెక్కన అద్దెకు తెచ్చుకుని వారి సేవలు పొందుతున్నారట. ఇగ భర్తలను సప్లయ్ చేసేందుకు అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. కొమండా 24 లాంటి సంస్థలు  గంటల లెక్కన భర్త  లను పొందండి అంటూ పురుషులను అద్దెకు ఇస్తున్నాయి. తాము అద్దెకు ఇచ్చే భర్తలు ప్లంబింగ్, కార్పెంటరీ, మరమ్మతులు, ఇంటి పనులు చేయడంలో కూడా నిష్ణాతులని ఆ సంస్థ ప్రచారం చేసుకుంటోంది. 

ఇంటిపనులు, ఇతర పనులలో నిష్ణాతులైన భర్తలకు మంచి గిరాకీ ఉంది  చాత్వియాలో.. గంటకు 44 డాలర్ల చొప్పున రోజుకు 280 డాలర్లు సంపాదిస్తున్నారు అక్కడి పురుషులు. 

జీవన విధానం, దురలవాట్ల కారణంగానే పురుషుల జీవన కాలం తగ్గిపోయి లింగ అసమతుల్యత ఏర్పడిందని, దేశంలోని పురుషుల్లో 31 శాతం మంది ధూమపానం చేస్తారని, అదే విధంగా ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారని వరల్డ్ అట్లాస్ తెలిపింది.

భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్ లాత్వియాకే పరిమితం కాలేదు. 2022లో UKలో లారా యంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్‌ను అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న పనులకు అద్దెకు తీసుకున్న తర్వాత వైరల్ అయింది.