Video Viral: గడ్డి అని తాకారా... ప్రాణాలు పోతాయి జాగ్రత్త..

Video Viral: గడ్డి అని తాకారా... ప్రాణాలు పోతాయి జాగ్రత్త..

జంతుప్రపంచంలో చాలా రకాల  జంతువులున్నాయి.  సాధారణంగా పాములను చూస్తే భయపడుతుంటాం. దాదాపు అన్ని రకాల పాములు విషపూరితంగా.. అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. తాజాగా ఓ పాము అందరినీ భయపెడుతోంది. నాచు (గడ్డి) వలే ఉన్న ఈ పాము ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

పచ్చటి గడ్డిలా కనిపించే అరుదైన పాముకు సంబంధించిన వీడియో థాయ్‌లాండ్‌లో వైరల్ అవుతోంది. ఇలాంటి స్నేక్ ఇంతవరకు ఎక్కడా కనపడలేదని స్థానికులు అంటున్నారు.    ఆకుపచ్చని రంగులో ఉండి  గడ్డి మాదిరిగా ఉన్నట్లు వీడియో చూస్తే స్పష్టంగా అర్దమవుతుంది.   ఆకుపచ్చ రంగులో  గడ్డి మాదిరిగా ...   డ్రాగన్‌లా కనిపించే ఈ పాము పొడవు 60 సెంటీమీటర్లు ఉంది.  ఈ పామును  స్థానికులు కనుగొన్నట్లు తెలుస్తోంది.   అయితే   ఇప్పుడు దానిపై పరిశోధనలు  చేసేందుకు శాస్త్రవేత్తల బృందానికి అప్పగించనున్నారు. 

@Humanbydesign3 అనే వినియోగదారుడు  దీన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలోపోస్టు  చేసారు.  ఆకుపచ్చ రంగు పాము థాయ్‌లాండ్‌లో కనుగొన్నారని  క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ( వార్త రాసే సమయానికి)  2.2 కోట్లకు పైగా జనాలు చూశారు.  75 వేలకు పైగా లైక్‌లు ,  10 వేల మందికి పైగా ప్రజలు దీనిని బుక్‌మార్క్ చేసారు., అంతేకాదు 15 వేల మంది రీట్వీట్ చేశారు.- . ఇది మిస్టీరియస్ ‘ఫర్రీ గ్రీన్ స్నేక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది ‘పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్’ అయి ఉంటుందని పేర్కొంటున్నారు.  కొందరు గడ్డిలో దాక్కుంటే గుర్తించడం చాలా కష్టమని రాయగా.. మరి కొందరు ఇలాంటి పామును ఎప్పుడూ చూడలేదని రాసుకొచ్చారు.