ఫౌండేషనల్ లిటరసీ విద్యావ్యవస్థకే గుండెకాయ : యోగితా రాణా

ఫౌండేషనల్ లిటరసీ విద్యావ్యవస్థకే గుండెకాయ : యోగితా రాణా
  • న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదస్సులో యోగితా రాణా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫౌండేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిటరసీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూమరసీ ఏదో ఒక విభాగం అమలు చేసే ప్రత్యేక పథకం కాదని, యావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యా వ్యవస్థకే గుండెకాయ లాంటిదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్యార్థుల హాజరు, నిరంతర మూల్యాంకనం, అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణ, టెక్నాలజీ తదితర అంశాలను ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మమేకం చేసినప్పుడే  గుణాత్మక మార్పు సాధ్యమవుతుందన్నారు.

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో జరిగిన  ‘గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిటరసీ రిఫార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ యూఎన్​ సదస్సులో  ఆమె ప్రసంగించారు. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు క్లాస్​ రూమ్​ స్థాయిలోనే నిరంతర డయాగ్నస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల చదువు, లెక్కల నైపుణ్యాల్లోని లోపాలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ప్రతిరోజూ ‘రెమిడియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అమలు చేస్తున్నట్లు వివరించారు.