ఇతర కులాలను ..బీసీ ‘ఏ’లో చేర్చొద్దు : భాగయ్య

ఇతర కులాలను ..బీసీ ‘ఏ’లో చేర్చొద్దు : భాగయ్య

ముషీరాబాద్, వెలుగు :  బీసీలోని ఏ గ్రూపులో అత్యంత వెనుకబడిన యాచక, సంచార కులాలు ఉన్నాయని.. అందువల్ల ఇతర కులా లను ఈ గ్రూపులో చేర్చొద్దని తెలంగాణ బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ భాగయ్య అన్నారు.

బుధవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రధాన కార్యదర్శి ఎంఎస్. నరహరితో కలిసి భాగయ్య మాట్లాడారు. ప్రభుత్వాలు  మారుతున్నా బీసీ ఏలోని యాచకులు, సంచార జాతుల వారిపై  దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం వీరిపై దృష్టి సారించాలన్నారు.