పోలీస్​ కస్టడీకి గోల్డ్ బిస్కెట్ల చోరీ నిందితులు

పోలీస్​ కస్టడీకి గోల్డ్ బిస్కెట్ల చోరీ నిందితులు

సికింద్రాబాద్, వెలుగు: గోల్డ్ బిస్కెట్ల చోరీ కేసులో నలుగురు నిందితులను మోండా మార్కెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 27న మోండా మార్కెట్ పాన్​బజార్​లోని నగల మెల్టింగ్ షాప్​కు వచ్చిన కొందరు వ్యక్తులు.. ఐటీ అధికారులమని చెప్పి కిలో 700 గ్రాముల బంగారు బిస్కెట్లను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం10 మంది నిందితులు ఉండగా.. ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో నలుగురు రెహ్మన్, జాకీర్, ఆకాశ్, ప్రవీణ్​ను ఈ నెల 15 వరకు విచారించేందుకు సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నలుగురిని శుక్రవారం మోండా మార్కెట్​పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిపై గతంలో కేసులున్నాయా? వేరే ప్రాంతాల్లో ఇలాంటి దోపిడీలకు పాల్పడ్డారా?, మిగతా నిందితుల వివరాలు, చోరీకి గురైన బంగారంపై మొదటిరోజు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.