కరీంనగర్ లో  కరెంట్ వైర్ల చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌‌

కరీంనగర్ లో  కరెంట్ వైర్ల చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌‌

కరీంనగర్​ రూరల్​, వెలుగు: కరీంనగర్​ రూరల్​ మండలం నగునూర్‌‌‌‌లోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్​లో కరెంట్​ వైర్లు చోరీ చేసిన నలుగురిని అరెస్ట్​ చేసినట్లు కరీంనగర్​ రూరల్​ సీఐ నిరంజన్‌‌రెడ్డి గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. విల్లాలో సుమారు రూ.60 వేల విలువైన కరెంటు వైర్ చుట్టలను చోరీ జరిగిందని విల్లా యజమాని పోలీసులకు కంప్లైంట్​ చేశారు.

గురువారం తీగలగుట్టపల్లి నుంచి ఆరెపల్లి దారిలో దొంగతనం చేసిన బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య, సూర శివాజీ, సూర నవీన్​ అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు పట్టుకున్నారు. వీరిని  విచారించగా కరెంట్​ వైర్ల దొంగతనం ఒప్పుకొని, వైర్లు దాచిపెట్టిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించడంతో స్వాధీనం చేసుకున్నారు.