ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన 4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన 4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లాలో జనావాసాలకు దగ్గరలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. ఒకట్రెండు కాదు.. ఏకంగా  నాలుగు పెద్ద పులులు సంచరిస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. భీంపూర్ మండలం తాంసి.కె సమీపంలో నాలుగు పెద్ద పులులు సంచరిస్తుండడం స్థానికులకు కనిపించింది. పులులు పెన్ గంగ వైపు వెళ్తుండగా చూసిన వారంతా ఊరిలోకి పరుగులు పెట్టారు.

పెద్ద పులులు సంచరిస్తున్నాయన్న సమాచారంతో పిప్పల్ కొటి రిజర్వాయర్ పనులను సిబ్బంది నిలిపివేశారు. ఈ నెల 13న తాంసి-కె సమీపంలో కనిపించిన పెద్దపులులు.. ఇవాళ మరోసారి కంటపడ్డాయి. అవన్నీ నీటి కోసం పెన్ గంగ వైపు వెళ్లి ఉంటాయని భావిస్తున్నారు. పులుల సంచారిస్తుండటంతో పొలాల్లో పని చేసుకునే వారి అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. బయటకు ఒంటరిగా వెళ్లొద్దని.. వీలైనంత వరకు గుంపులుగా వెళ్లాలని చెబుతున్నారు.