
సికింద్రాబాద్: బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. పార్కింగ్ స్థలాల్లో, మెట్రో స్టేషన్లలో పార్క్ చేసిన బైక్‌లను దొంగలు చోరీ చేస్తున్నారు. దొంగలను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు బైక్‌లు, 10 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.