
బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన డ్రంక్అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురిని పట్టుకున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. వారిపై కేసులు నమోదు చేశామన్నారు. బాల్కొండ నుంచి వన్నెల్(బి) వెళ్లే దారిలో నిర్వహించిన తనిఖీలను ఏసీపీ జగదీశ్చందర్ పరిశీలించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.