కిటికీ ఊచుల కోసి.. జువైనల్ హోం నుంచి నలుగురి పరారీ

కిటికీ ఊచుల కోసి.. జువైనల్ హోం నుంచి నలుగురి పరారీ
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
  • ముగ్గురిది ఆదిలాబాద్ జిల్లా.. ఒకరిది మహారాష్ట్ర
  • పారిపోయిన మైనర్ల కోసం గాలిస్తున్న పోలీసులు

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని జువైనల్ హోం నుంచి నలుగురు మైనర్లు శనివారం తెల్లవారు జామున పరారయ్యారు. నగర శివారులోని పరిశీలన గృహం కిటికీల ఊచలు తొలగించుకొని పా రిపోవడం సంచలనం రేకెత్తించింది. పారిపోయిన వారిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 10, 13 ఏండ్ల బాలురు ఉన్నారు.

వీరు ఫిబ్రవరి 3వ తేదీన, అదే జిల్లాకు చెందిన మరో 17 ఏండ్ల బాలుడు ఈ నెల 1వ తేదీన జువైనల్ హోంలో చేరారు. మహారాష్ట్రకు చెందిన మరో 16 ఏండ్ల బాలుడు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి జువైనల్ హోంలో ఉంటున్నాడు. వివిధ కేసుల్లో నిందితు లుగా ఉన్న వీళ్లంతా ఒకే రోజు పారిపోవడం గమనార్హం.

జువైనల్ హోం ఇన్చార్జి సూప రింటెండెంట్ ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్లెస్ మెసేజ్ పంపించారు. పరారైన వారిలో కొందరిపై హత్య అభియోగాలు ఉన్నట్లు తెలుస్తోంది.