
డల్లాస్: అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనమైన దుర్ఘటన పెను విషాదం నింపింది. హైదరాబాద్కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్, దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ కుటుంబం వెకేషన్ కోసం డల్లాస్కి వెళ్ళింది. సెలవులు ఉండటంతో అట్లాంటలోని బంధువుల ఇంటికి వెంకట్ కుటుంబంతో కలిసి కారులో వెళ్లాడు. వారం రోజుల పాటు అక్కడే గడిపి అట్లాంట నుంచి డల్లాస్ కు తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
అర్థరాత్రి డల్లాస్కు ఫ్యామిలీతో కలిసి అట్లాంట నుంచి వెంకట్ తిరుగు ప్రయాణం అయ్యాడు. గ్రీన్ కౌంటి ఏరియాలో ఒక మినీ ట్రక్ రాంగ్ రూట్లో వచ్చి వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడంతో మంటలు రేగాయి. అప్పటికే ట్రక్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలైన వెంకట్ కుటుంబం కారులో నుంచి బయటపడలేకపోయింది. కారు మొత్తం ఈ మంటల్లో కాలిపోయింది. ఈ మంటల్లోనే వెంకట్, ఆయన భార్య తేజస్విని, ఇద్దరు పిల్లలు కాలి బూడిదయిపోయారు.
►ALSO READ | వామ్మో.. ఈ మొక్క ఇంత డేంజరా.. ఈ మొక్కలు తిని 90 గొర్రెలు చచ్చిపోయినయ్..!
కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్కు పంపారు. డీఎన్ఏ శాంపిల్ తీసుకొని మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ విషాద ఘటనతో వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆహ్లాదంగా గడపడానికి వెళ్లి.. ఆనందంగా బంధువులతో గడిపి.. తిరిగి ఇంటికి వెళుతుండగా ఇలా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇరు కుటుంబాలకు గుండె తరుక్కుపోయేలా చేసింది. హైదరాబాద్కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ డల్లాస్లో స్థిరపడింది.
పెను విషాదం.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం pic.twitter.com/GortLHCIjS
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) July 7, 2025