
Gold Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారం షాపింగ్ కోసం చాలా కాలం నుంచి రేట్లెప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. అమెరికా ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందానికి సమయం దగ్గరపడుతున్న వేళ బంగారం ధరలు కూడా ఆశావాదంతో తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రేట్లు భారీగా తగ్గాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5వేల భారీ తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 010, ముంబైలో రూ.9వేల 010, దిల్లీలో రూ.9వేల 025, కలకత్తాలో రూ.9వేల 010, బెంగళూరులో రూ.9వేల 010, కేరళలో రూ.9వేల 010, వడోదరలో రూ.9వేల 015, జైపూరులో రూ.9వేల 025, లక్నోలో రూ.9వేల 025, కోయంబత్తూరులో రూ.9వేల 010, మంగళూరులో రూ.9వేల 010, నాశిక్ లో రూ.9వేల 013, మైసూరులో రూ.9వేల 010, అయోధ్యలో రూ.9వేల 025, బళ్లారిలో రూ.9వేల 010, నోయిడాలో రూ.9వేల 025, గురుగ్రాములో రూ.9వేల 025 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల 400 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 829, ముంబైలో రూ.9వేల 829, దిల్లీలో రూ.9వేల 844, కలకత్తాలో రూ.9వేల 829, బెంగళూరులో రూ.9వేల 829, కేరళలో రూ.9వేల 829, వడోదరలో రూ.9వేల 833, జైపూరులో రూ.9వేల 844, లక్నోలో రూ.9వేల 844, కోయంబత్తూరులో రూ.9వేల 829, మంగళూరులో రూ.9వేల 829, నాశిక్ లో రూ.9వేల 832, మైసూరులో రూ.9వేల 829, అయోధ్యలో రూ.9వేల 844, బళ్లారిలో రూ.9వేల 829, నోయిడాలో రూ.9వేల 844, గురుగ్రాములో రూ.9వేల 844గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 100 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 290గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.