
ఈ ఫొటో చూడగానే.. అదేంటి.. ‘కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవికి పెళ్లైందా..? ఇదెప్పుడు జరిగింది..? అని ఫొటో చూసిన చాలా మంది నెటిజన్లు అవాక్కయ్యారు. కానీ.. ఆమె రెండో సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ పూజలో భాగంగా ఆమె మెడలో, హీరో మెడలో దైవ సన్నిధిలో ఉంచిన పూల దండలు వేశారు. అంతేకానీ.. ఆమెకు ఎవరితోనూ పెళ్లి కాలేదు. ఆమెకు ఇప్పట్లో అలాంటి ఆలోచన కూడా లేదు.
తెలుగు, తమిళ భాషల్లో ' గుర్తింపు' పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో హీరోగా పరిచయమవుతోన్న ‘కేజేఆర్’ హీరోగా తన రెండో చిత్రం ప్రకటించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ‘కోర్ట్’ ఫేం శ్రీదేవికి అవకాశం దక్కింది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల 'మార్క్ ఆంటోనీ' చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ అందించనుంది.
ALSO READ | మరోసారి ప్రభాస్ పక్కన తమన్నా: 'రాజా సాబ్'లో డార్లింగ్ తో స్టెప్పులు!
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. 'కోర్ట్' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్వి రాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: పి. వి. శంకర్, నిర్మాత: ఎస్. వినోద్ కుమార్.
#MiniStudios Prod No.15 Pooja❤️
— Saloon Kada Shanmugam (@saloon_kada) July 7, 2025
Stars : KJR - Sri Devi (Court) - Arjun Ashokan - HarishKumar - Aju Varghese
Music : Ghibran (Thunivu)
Direction : Regan Stanislaus (Debut - Vilangu Associate Director)
Shoot Starts From Today!! pic.twitter.com/UNFVcoo7BR