
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) .. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'కల్కి 2898 AD' ( Kalki 2898 AD ), 'ది రాజా సాబ్' ( The Raja Saab ) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా, ఒక వార్త సినీ వర్గాల్లో గుప్పుమంది - అదే, మరోసారి ప్రభాస్ పక్కన తమన్నా భాటియా ( Tamannaah ) నటించబోతోందనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే, ఈ మిల్కీ బ్యూటీ ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా ఇప్పటికే మూడుసార్లు నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' ( Baahubali ) రెండు భాగాల్లో (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కంక్లూజన్) అవంతిక పాత్రలో తమన్నా ప్రభాస్ పక్కన మెరిసి మెప్పించింది. అంతకుముందు, 2012లో వచ్చిన 'రెబల్' చిత్రంలో కూడా ఈ జంట సందడి చేసి అలరించింది. ఇలా మూడు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఒక్కడే ఒక్క ట్విస్ట్ఉంది. ఇప్పుడు ప్రభాస్ పక్కన ఐటెం సాంగ్ చేయనుందనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్'!
ALSO READ| Kingdom : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్': వాయిదాలకు తెర, జూలై 31న 'రణరంగం' షురూ!
'ది రాజా సాబ్' మూవీ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్‌లో కనిపించనున్నట్లు వస్తున్న వార్తలు సినిమాకు మరింత హైప్ ఇస్తున్నాయి. ఈ పాట చిత్రీకరణ తేదీల కోసం తమన్నాతో చిత్ర యూనిట్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి ఒక ఐటెం సాంగ్‌లో స్టెప్పులేస్తే థియేటర్లలో సందడే సందడి అని అభిమానులు అప్పుడే ఊహించుకుంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే, అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
ఈ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు వరుస ఐటెం సాంగ్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. గత ఏడాది రజనీకాంత్ 'జైలర్' చిత్రంలో 'నువ్.. కావాలయ్యా' పాటతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సాంగ్‌లో తమన్నా వేసిన స్టెప్పులు, చూపిన గ్లామర్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. తాజాగా విడుదలైన 'స్త్రీ 2' సినిమాలో 'ఆజ్‌కీ రాత్' అంటూ తన మార్క్ డ్యాన్స్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించింది.
ప్రస్తుతం తమన్నాకు తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు కొంత తగ్గుముఖం పట్టినా, ఐటెం సాంగ్స్‌కు మాత్రం ఆమె మొదటి ప్రాధాన్యతగా మారింది. తన డ్యాన్స్ టాలెంట్‌తో, గ్లామర్‌తో ఎలాంటి పాటనైనా తన మార్క్ వేసుకునే తమన్నా, ఈ కొత్త పాత్రతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. 'ది రాజా సాబ్' మేకర్స్ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పక్కన ఐటెం సాంగ్ అంటే, తమన్నా కెరీర్‌కు కూడా ఇది ఒక పెద్ద బూస్ట్‌గా మారే అవకాశం ఉంది. ఈ వార్త కేవలం పుకారా లేక నిజమా అనేది త్వరలోనే తేలిపోతుంది!