కల్లు గీత సొసైటీలకు నీరా కేఫ్..టెండర్ పిలిచిన టాడీ టాపర్స్ కార్పొరేషన్

కల్లు గీత సొసైటీలకు నీరా కేఫ్..టెండర్ పిలిచిన టాడీ టాపర్స్ కార్పొరేషన్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో రన్ అవుతున్న నీరా కేఫ్, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు టాడీ టాపర్స్ కో–ఆపరేటివ్​ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ టెండర్ పిలిచింది. వీటితోపాటు అదే ప్రాంగణంలో ఉన్న ఏడు కమర్షియల్ షాపులు, బాంకెట్​హాల్ సైతం లీజుకు ఇవ్వనున్నారు.

బుధవారం నుంచి ఈనెల 25 వరకు టెండర్ దాఖలుకు గడువు ఇచ్చినట్లు కార్పొరేషన్ ఎండీ ఉదయ్ ప్రకాశ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కల్లు గీత కార్మికుల సొసైటీలు టెండర్లు దాఖలు చేసేందుకు అర్హులని తెలిపారు. ఈనెల 26న మసాబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ లోని కార్పొరేషన్ కార్యాలయంలో టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్ ను ఒపెన్ చేస్తామని వెల్లడించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నీరా కేఫ్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారడంతో సొసైటీలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.