Kingdom : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్': వాయిదాలకు తెర, జూలై 31న 'రణరంగం' షురూ!

Kingdom : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్': వాయిదాలకు తెర, జూలై 31న 'రణరంగం' షురూ!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ  (  Vijay Devarakonda .. ఈ పేరు వినగానే యువతలో ఒక వైబ్రేషన్, సరికొత్త కథలను ఎంచుకునే సాహసం గుర్తుకొస్తుంది. 'అర్జున్ రెడ్డి'తో ప్రభంజనం సృష్టించి, 'గీత గోవిందం'తో ప్రేమకథా చిత్రాల హీరోగా నిలదొక్కుకున్న విజయ్, ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు.  తన తదుపరి చిత్రం 'కింగ్‌డమ్' (  Kingdom )తో ప్రేక్షకులను మళ్ళీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 

గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ 'కింగ్‌డమ్' మూవీ   విడుదల తేదీ  ఎట్టకేలకు ఖరారైంది.   ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని జులై 31న  (  Kingdom Movie release Date  ) విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  ప్రకటించింది.   "  ఒక మనిషి.. ఆగ్రహంతో నిండిన హృదయం .. దూరంగా నెట్టేసిన ప్రపంచం.. ఇప్పుడు మారణ హోమానికి సమయం '  అంటూ  రిలీజ్ ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.  ఈ ప్రోమో చూసిన అభిమానులు ఆనందనికి హద్దులు లేవు.  టీజర్ లో హృదయం లోపల అంటూ సాగే పాట అభిమానులను కేరింతలు కొడుతున్నారు. ఈ సినిమా ప్రకటన, టీజర్ విడుదలైనప్పటి నుంచీ అంచనాలను అమాంతం పెంచేసింది. 


ఈ పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.  ఇప్పటికే  ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తొలుత ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఈ తర్వాత మే 30వ  తేదీకి, మరో జులై 4కు మారింది.  పోస్ట్ ప్రోడక్షన్ పనులతో సహా వివిధ కారణలతో 'కింగ్‌డమ్' వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా జులై 31న  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటిస్తూ ప్రోమోను విడుదల చేశారు. 

►ALSO READ | Bigg Boss Telugu 9 : స్టార్‌డమ్‌తో సామాన్యుడి కల: 'బిగ్ బాస్ తెలుగు 9'లోకి లక్షల్లో దరఖాస్తులు, రేపే చివరి ఛాన్స్!

ఈ 'కింగ్‌డమ్' మూవీలో విజయ్ దేవరకొండ గూఢచారిగా కనించనున్నాట్లు సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు . ఇప్పటికే ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.  ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న విజయ్ ..  ఈ 'కింగ్ డమ్' తో మెప్పిస్తారో లేదా ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే మరి.