గోల్డ్ స్టాక్ కనకవర్షం.. రెండు రోజుల్లో 36 శాతం అప్, మీ దగ్గర ఉంటే అమ్మెుద్దు..!

గోల్డ్ స్టాక్ కనకవర్షం.. రెండు రోజుల్లో 36 శాతం అప్, మీ దగ్గర ఉంటే అమ్మెుద్దు..!

PC Jeweller Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. మార్కెట్లు లాభాల్లో ఉన్నా లేక నష్టాల్లో ఉన్నా  వాటితో ఎలాంటి సంబంధం లేకుండా తమ ఇన్వెస్టర్లకు మాత్రం అవి కనకవర్షం కురిపిస్తూనే ఉన్నాయి. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్మాల్ క్యాప్ స్టాక్ పీసీ జ్యువెలర్ గురించే. చాలా కాలంగా మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న స్టాక్ గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 15 శాతానికి పైగా లాభపడ్డాయి. మధ్యాహ్నం 12.14 గంటల సమయంలో షేర్ ధర ఒక్కోటి రూ.18.89 వద్ద కొనసాగుతున్నాయి. అలాగే నేడు షేర్లు తమ 52వారాల గరిష్ఠానికి చేరువకు వెళ్లాయి. దీనికి ముందు శుక్రవారం స్టాక్ ధర 19 శాతం వరకు పెరిగింది.

స్టాక్ ధర పరుగులు ఎందుకు..
వరుసగా కంపెనీ షేర్లు పెరగటానికి ఒక కీలకమైన కారణం ఉంది. కంపెనీ ప్రకటించిన మెుదటి త్రైమాసిక ఆదాయం వార్షిక ప్రాతిపధికన 80 శాతం పెరుగుదలను నమోదు చేయటంతో స్టాక్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అలాగే ఆర్థిక సంవత్సరం మెుదటి మూడు నెలల్లో కంపెనీ లాభం రూ.95 కోట్లుగా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ రూ.124 కోట్ల నష్టాన్ని చూసింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 237 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. 

ALSO READ : మీ దగ్గర రూ.23 లక్షలు ఉంటే చాలు.. గోల్డెన్ వీసాతో

పీసీ జ్యువెలర్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా రుణ విముక్తి అవుతుందని వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంలో జ్యువెలరీ సంస్థ తన రుణాల్లో 50 శాతం వరకు చెల్లించేసింది. అయితే ఈ ఏడాది మిగిలిన చెల్లింపులను పూర్తి చేయాలని చూస్తోంది. మరో శుభవార్త ఏమిటంటే తొలి త్రైమాసికంలోనే 7.5 శాతం రుణాలను కూడా క్లియర్ చేసింది సంస్థ. కంపెనీ క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుండా లాభదాయకంగా, బలంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.