
నల్లగొండ జిల్లా: నల్లగొండ డీఎస్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయాడు. నల్గగొండ, సూర్యాపేట జిల్లా్ల్లో ఏసీబీ చేస్తు్న్న దాడుల్లో ఇటీవల లంచానికి మరిగిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంగా దొరికిపోయారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ ఆఫీస్లో రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా, భూభారతి డేటా ఎంట్రీ ఆపరేటర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ మండలంలోని కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన తోట రాంబాబుకు 12 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఈ భూమికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చేందుకు భూభారతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కర్నాటి విజేతారెడ్డి రూ.20 వేలు డిమాండ్ చేశాడు. రూ.12 వేలు ఇస్తానని ఒప్పుకున్న రైతు, ఏసీబీ అధికారుల సూచన మేరకు శనివారం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విజేతా రెడ్డిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.