రాజు వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ఆనందరాజు కన్నుమూత

రాజు వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ఆనందరాజు కన్నుమూత

రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకులు(  డైరెక్టర్) ఆనందరాజు  కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో జులై 6న తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఉమ్మడి పశ్చిమగోదావరి గణపవరంలో ఆరు ఎకరాల స్థలం కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు.  ఆయనకు భార్య, ఒక కొడుకు కూతురు ఉన్నారు.  ఫౌండేషన్ ద్వారా దేశంలోని పలు ఆలయాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు.

ఆనంద రాజు చేసిన సేవలు

రూ.77 కోట్లతో తిరుమలలో అన్నదాన సత్రం, రూ.27 కోట్లతో నీటిశుద్ధి ప్లాంట్ నిర్మించారు. వాటి నిర్వహణకు ఏటా రూ.1.50 కోట్లు ఇస్తున్నారు.  షిర్డీలోనూ నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. తిరుపతి, ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు.  యాదాద్రి ఆలయంలో రూ.25 కోట్లతో అన్నదాన సత్రం నిర్మించారు. దేవాలయాలు ఉన్న చోట్ల బస్టాండ్లు. రైల్వేస్టేషన్లలో అనేక వసతుల కల్పనకు కృషి చేశారు.  విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ, ద్వారకా బస్టాండ్ లోనూ సౌకర్యాలు కల్పించారు. పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాల్లో పిల్లల చదువుకు అవసరమైన నిధులు సమకూర్చారు. విశాఖ,  హైదరాబాద్లో‌ ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. 

►ALSO READ | తిరుపతిలో కత్తితో సైకో వీరంగం : ఒకరి మృతి.. చేతులు కట్టేసి పట్టుకెళ్లిన పోలీసులు