తిరుపతిలో కత్తితో సైకో వీరంగం : ఒకరి మృతి.. చేతులు కట్టేసి పట్టుకెళ్లిన పోలీసులు

 తిరుపతిలో కత్తితో సైకో వీరంగం : ఒకరి మృతి.. చేతులు కట్టేసి పట్టుకెళ్లిన పోలీసులు

తిరుపతి: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిల్ తీర్థం రోడ్డులో ఓ సైకో కత్తితో  వీరంగం సృష్టిస్తు ముగ్గురి పై దాడి చేసాడు. వీరిలో ఒకరు మృతి చెందగా, ఇరువురికి గాయాలు అయ్యాయి. సైకోప్ దాడిలో గాయపడిన మృతుడు శేఖర్ (55) గా గుర్తించారు. కపిలతీర్థం పార్కింగ్ లో పనిచేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతంలో ఉంటున్న కల్పన కు గాయాలు కాగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతఝన్నారు. దాదాపు గంటసేపు స్థానికులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది కష్టపడి నిందితుని వలవేసి పట్టుకున్నారు. అయితే సైకో  తమిళనాడుకు చెందినవాడుగా గుర్తించి, బంధించారు.  

►ALSO READ | ప్రకాశం బ్యారేజిలో దూకి ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య..