ప్రకాశం బ్యారేజిలో దూకి ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య..

ప్రకాశం బ్యారేజిలో దూకి ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య..

సత్తెనపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ఓనర్ ప్రకాశం బ్యారేజిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ( జులై 5 ) ఇంటి నుంచి కనిపించకుండా పోయిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే శ్రీధర్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. 

పోలీసులు ప్రకాశం బ్యారేజిలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఈమేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీధర్ ఆత్మహత్యతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటన పట్ల శ్రీధర్ సన్నిహితులు, స్థానికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.