IND vs WI: ఆసియా కప్ ఫైనల్‌కు ఇండియా.. టెస్ట్ సిరీస్‌లో ఆ నలుగురి పరిస్థితి ఏంటి..?

IND vs WI: ఆసియా కప్ ఫైనల్‌కు ఇండియా.. టెస్ట్ సిరీస్‌లో ఆ నలుగురి పరిస్థితి ఏంటి..?

టీమిండియా అంచనాలకు తగ్గటు ఆడుతూ ఆసియాకప్ ఫైనల్ కు వచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 28) పాకిస్థాన్ తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఆసియా కప్ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత జరగబోయే వెస్టిండీస్ సిరీస్ చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఆసియా కప్ సెప్టెంబర్ 28 ముగుస్తుంది. ఆ తర్వాత మూడు రోజుల గ్యాప్ లో ఇండియా వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.   

ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న జట్టులో నాలుగు ప్లేయర్లు వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆడనున్నారు. టీమిండియా స్క్వాడ్ లో కెప్టెన్ శుభమాన్ గిల్ తో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నారు. వీరి నలుగురు రెస్ట్ లేకుండానే టెస్ట్ సిరీస్ కు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నలుగురు కూడా ఇండియా ప్లేయింగ్ 11లో ఆడతారు. రెస్ట్ లేకుండా వెంటనే క్రికెట్ ఆడాల్సిన రావడం వీరికి కొంచెం ప్రతికూలంగా మారనుంది. వీరి బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని ఈ యువ నలుగురు క్రికెటర్లపై బీసీసీఐ పని భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేసే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది. 

►ALSO READ | Asia Cup 2025: మ్యాచ్ మాత్రమే ఆడండి.. సూర్యతో పాటు ఇద్దరు పాక్ క్రికెటర్లపై ఐసీసీ కొరడా

సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ ఆడితే 29న దుబాయి నుంచి భారత జట్టు ఇండియాకు వస్తుంది. 30న అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. అక్టోబర్ 1న టెస్ట్ సిరీస్ కు సిద్ధమవ్వాలి. పోనీ ఈ సిరీస్ తర్వాత ఏమైనా రెస్ట్ లభిస్తుందా అంటే మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఉంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 

వెస్టిండీస్ సిరీస్ కు టీమిండియా స్క్వాడ్:

శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌, దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజా (వైస్​ కెప్టెన్​),  వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎన్‌‌‌‌‌‌‌‌. జగదీశన్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌. 

ఇండియాతో టెస్ట్ సిరీస్ కు వెస్టిండీస్ జట్టు: 

రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, జోహన్ లేన్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడెన్ సీల్స్