మెల్‌బోర్న్: ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే)కు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని 4–0కు పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక్క స్పిన్నర్ కూడా లేకుండానే బరిలోకి దిగుతుంది. స్టార్ స్పిన్నర్ నేథన్ లైయన్ గాయపడటంతో అతని ప్లేస్‌లో టాడ్ మర్ఫిని తీసుకుంటారని భావించారు. కానీ ఆసీస్ మాత్రం ఫుల్ పేస్ బలగంతో 12 మంది జట్టును ప్రకటించింది.
ఎంసీజీ పిచ్‌పై ఎక్కువ మొత్తంలో పచ్చిక ఉండటంతో పేసర్ల వైపు మొగ్గారు. టాస్‌కు ముందు ఫైనల్ ఎలెవన్‌ను ప్రకటించనున్నారు. అయితే సిడ్నీ టెస్ట్‌లో మర్ఫి ఆడే చాన్స్ ఉందని కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంకేతాలిచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. మూడో టెస్ట్‌లో 82, 40 రన్స్ చేసిన ఉస్మాన్ ఖవాజాను కొనసాగించారు. నాలుగేళ్ల తర్వాత జే రిచర్డ్‌సన్ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
మైకేల్ నీసర్, బ్రెండన్ డగెట్ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు సిరీస్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్ పరువు కోసం పాకులాడుతోంది. ఈ క్రమంలో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఒలీ పోప్‌ను తప్పించి జాకబ్ బీథెల్, బెన్ డకెట్‌ను తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేకపోవడం చాలా పెద్ద మైనస్‌గా మారింది. గస్ అట్కిన్సన్ పేస్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పిచ్ బౌలర్లకు సహకరించినా బ్యాటర్లు ఓపికను చూపెడితే భారీ స్కోర్లు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
