రష్యా పోయి ఫ్రాన్స్ వచ్చె: రాఫెల్‌‌ జెట్స్‌‌ అమ్మడానికి రెడీ

రష్యా పోయి ఫ్రాన్స్ వచ్చె: రాఫెల్‌‌ జెట్స్‌‌ అమ్మడానికి రెడీ

36 రాఫెల్‌‌ జెట్స్‌‌ అమ్మడానికి ఫ్రాన్స్ రెడీ

రష్యా.. మన రక్షణ భాగస్వామి. కోల్డ్ వార్ నాటి నుంచే మనకు అండగా నిలుస్తోంది. డిఫెన్స్ విషయంలో సాయం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్​ను ఫ్రాన్స్ ఆక్రమించింది. వెస్ర్టన్ ప్రపంచంలో మనకు రక్షణ భాగస్వామిగా అవతరించింది. ఆర్టికల్ 370 రద్దుపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్​లో జరిగిన క్లోజ్ డోర్ సమావేశంలో మనకు మద్దతుగా మాట్లాడి.. స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అంతకుముందు మసూజ్ అజర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ యూఎన్ఎస్​సీ తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా సపోర్టు చేసింది.

నమ్మకమైన మిత్రుడు

పాకిస్తాన్, కాశ్మీర్​లను దృష్టిలో పెట్టుకుని ఇండియా నేషనల్ సెక్యూరిటీ అవసరాలను రష్యా అర్థం చేసుకునేది. ఇండియా కోసం వీటో అధికారాన్ని కూడా ఉపయోగించేది. ఆర్థిక సాయం, డిఫెన్స్ పరికరాలు అందించేది. అయితే రానురాను చైనాకు దగ్గరైంది. పాకిస్తాన్, టెర్రరిజం తదితరాల విషయంలో ఇండియా ప్రయోజనాల గురించి అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఫ్రాన్స్, ఇండియాల మధ్య స్నేహం చిగురించింది. కొన్నిదశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఎకనామిక్, సెక్యూరిటీ, డిప్లమాటిక్ సంబంధాలు మెరుగయ్యాయి. ఫ్రాన్స్.. మనకు మరో ‘రష్యా’గా, కొత్త, బెస్ట్ ఫ్రెండ్​లా మరీ ముఖ్యంగా నమ్మకమైన మిత్రుడిగా మారింది.

ఫ్రెండ్​షిప్ బలపడిందిలా..

యూఎన్ఎస్​సీలో పర్మినెంట్ మెంబర్ అయిన ఫ్రాన్స్.. ఇండియాకు పర్మినెంట్ మెంబర్​షిప్​ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించింది, ప్రయత్నిస్తోంది.

1974లో తారాపూర్​లోని ఇండియన్ అటామిక్ పవర్ స్టేషన్​కు న్యూక్లియర్ ఫ్యూయల్​సరఫరాను అమెరికా నిలిపేసినప్పుడు మనకు అండగా నిలిచింది. యురేనియం సప్లై చేసేందుకు ముందుకు వచ్చింది.

1998లో ఇండియా న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు.. వ్యతిరేకించని అతికొన్ని దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. తర్వాత స్పేస్, సెక్యూరిటీ, డిఫెన్స్, సివిల్ న్యూక్లియర్ కో ఆపరేషన్​తదితరాలపై మనతో వ్యూహాత్మక బంధాలను బలపరుచుకుంది.

న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్​జీ)​లో ఇండియాకు సభ్యత్వం కల్పించాలని గట్టిగా మాట్లాడింది.

2009 జులైలో 400 మంది ఇండియన్ ఆర్మ్​డ్ ఫోర్స్ సిబ్బంది.. ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్​లో పాల్గొన్నారు. మన సైనికులు ఇంకో దేశం నేషనల్ డే పరేడ్​లో పాల్గొనడం అదే తొలిసారి.

రెండు దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ విలువ 10.7 బిలియన్ల యూరోలు (రూ.85 వేల కోట్లు). ఇండియాలో ఉన్న 1000 ఫ్రెంచ్ కంపెనీల టర్నోవర్ 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.43 లక్షల కోట్లు). అదే ఫ్రాన్స్​లో ఉన్న 120 కంపెనీల టర్నోవర్ 1 బిలియన్ యూరోలు (రూ.8 వేల కోట్లు).

3 దేశాల టూర్‌‌‌‌కు మోడీ
మూడు దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరి వెళ్లారు. గురువారం నుంచి 26వ తేదీ వరకు ఆయన పర్యటన సాగుతుంది. తొలుత ఫ్రాన్స్లో పర్యటిస్తారు. ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యువల్ మేక్రాన్తో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చిస్తారు. అలాగే ఫ్రాన్స్ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్తోనూ భేటీఅవుతారు. తర్వాత 23–24 తేదీల్లో యూఏఈలో, 24 –25 తేదీల్లో బహ్రెయిన్లో పర్యటిస్తారు. 25–26 తేదీల్లో జీ7 సమ్మిట్లో పాల్గొంటారు.