యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ లో అమెరికా ఆటగాళ్లు సత్తా చాటారు. 18 ఏళ్ళ తర్వాత సొంత టోర్నీలో ఒకరు ఫైనల్ ఆడడం ఖరారైంది. మంగళవారం (సెప్టెంబర్ 3) అర్ధ రాత్రి జరిగిన తొలి క్వార్టర్-ఫైనల్ లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ 7-6 (7-2) 3-6 6-4 7-6 (7-3)తో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మరో క్వార్టర్స్ లో ఫ్రాన్సెస్ టియాఫో 6-3 6-7 (5-7) 6-3 4-1 తో గ్రిగోర్ డిమిత్రోవ్ పై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లాడు.
Also Read :- సెమీస్‌కు దూసుకెళ్లిన బోపన్న జోడీ
నాలుగో సెట్ లో 1-4 తో డిమిత్రోవ్ వెనకబడిన దశలో గాయంతో మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. శుక్రవారం (సెప్టెంబర్ 6) జరగబోయే సెమీ ఫైనల్లో టియాఫోతో ఫ్రిట్జ్ తలపడతాడు. వీరిద్దరూ అమెరికా ప్లేయర్స్ కావడం విశేషం. వీరిద్దరిలో ఒకరు యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం ఖాయమైంది. దీంతో 18 సంవత్సరాల తర్వాత ఒక అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఆండీ రాడిక్ 2003లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. 2006 లో ఫెదరర్ పై యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయాడు.
Taylor Fritz. Frances Tiafoe.
— ESPN (@espn) September 4, 2024
Cinema 🍿 #USOpen pic.twitter.com/YuGhxdLuAe