OMG : భారీ ఓడ ఢీకొని.. కూలిపోయిన పెద్ద బ్రిడ్జి

OMG : భారీ ఓడ ఢీకొని.. కూలిపోయిన పెద్ద బ్రిడ్జి

అమెరికా ఓ పెద్ద బ్రిడ్జి కుప్పకూలింది. బాల్టిమోర్ లోని మరియాలాండ్ సమీపంలో ఉన్న ఫ్రాంసిస్ స్కాంట్ కీ బ్రిడ్జిని భారీ ఓడ ఢీకొనడంతో కూలిపోయింది. మంగళవారం (మార్చి 26) జరిగిన ఈ ప్రమాదంలో ఓడ కూడా పటాప్స్ కో నదిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జి పై ప్రయాణిస్తున్న వందలాది వాహనాలు సముద్రపు నీటిపడి మునిగిపోయాయి. ఈ ప్రమాందలో ఏడుగురు నదిలో పడిపోయినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల( ఇండియా టైం ప్రకారం  తెల్లవారు జామున 5.30 గంటలకు) సమయంలో  ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక వార్తాపత్రికలు చెబుతున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ లు ఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు  నిలిపివేశారు. 

ALSO READ | వాళ్లే రష్యాపై దాడి చేశారు.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి .. దీనిని 1977లో నిర్మించారు. కీ బ్రిడ్జ్, బెల్ట్ వే బ్రిడ్జిగా కూడా పిలుస్తారు. ఇది దిగువ పటాప్ స్కో నది, బాల్టిమోర్ హార్బర్ మధ్య విస్తరించి ఉంది. 366 మీట్ల వెడల్పుతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బ్రిడ్జి. బాల్టిమోర్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో అతి పొడవైన వంతెన అయిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి మంగళవారం భారీ ఓడ ఢీకొనడంతో కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.