కరోనా వ్యాక్సిన్ పేరుతో మోసం.. ఖాళీ అవుతున్న బ్యాంక్ ఖాతాలు

కరోనా వ్యాక్సిన్ పేరుతో మోసం.. ఖాళీ అవుతున్న బ్యాంక్ ఖాతాలు
హైదరాబాద్ : కరోనా కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలు చేస్తున్నారు. కరోనా పట్ల ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని కరోనా కు వ్యాక్సిన్ రాబోతుందని.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ కార్డు, బ్యాంక్, మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ వివరాలను పంపించమని అడిగుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. వారు అడిగిన వివరాలను పంపించగానే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీపీ సజ్జనార్. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అంటూ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మోసమని గ్రహించాలన్నారు.  అనుమానం ఉంటే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444, సైబరాబాద్ సైబర్ క్రైమ్ నంబర్స్ కు కంప్లైంట్స్ సెల్ 9490617310 నంబర్లలో సంప్రదించాలన్నారు .