ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

హైదరాబాద్(​ఎల్బీనగర్), వెలుగు: ఫేస్​బుక్ నోటిఫికేషన్​తో రూ.41.98లక్షలు కొట్టేసిన మధ్యప్రదేశ్​కు చెందిన ఆదిత్యనారాయణ్​గాడ్బోలేను రాచకొండ సైబర్​క్రైమ్ ​పోలీసులు అరెస్ట్​చేశారు. రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సిటీలోని నాగోల్​కు చెందిన వ్యక్తికి ఫారెక్స్ ట్రేడింగ్ అనే నకిలీ యాప్​నుంచి పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ వస్తుందని ఫేస్​బుక్​ నోటిఫికేషన్​ వచ్చింది. క్లిక్​చేసి డీటెయిల్స్​ ఎంటర్ చేశాడు. డిసెంబర్1 నుంచి17 వరకు రూ.41.98 లక్షలు ట్రాన్స్​ఫర్​చేశాడు. ఆ తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్​లేకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్​చేశాడు. విచారణలో ఇండోర్​కు చెందిన ఆదిత్య నారాయణ్ గోడ్బోలే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. ఫారెక్స్ ట్రేడింగ్ యాప్ ను​చైనాకు చెందిన మౌజిబిన్ తయారు చేయగా, ఇండియాలో ఆదిత్య రన్​చేస్తున్నట్లు తెలిసింది. ఆదిత్య గతంలో ఎంబీబీఎస్​ చేసేందుకు చైనా వెళ్లివచ్చాడు.

For More News..

మహిళను కొట్టిన టీఆర్ఎస్ కార్పొరేటర్​ను అరెస్ట్​ చెయ్యాలె

రైతులు అమ్ముకున్నంక.. రేటు పెంచిన్రు.. రూ. 2500 నుంచి 5900కి పెంపు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్