మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ వల్ల ఆర్టీసీకి రూ. 14 వందల కోట్లు నష్టం : కేటీఆర్

మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ వల్ల ఆర్టీసీకి రూ. 14 వందల కోట్లు నష్టం : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ రెడ్డి మైక్ వీరుడు. మైకు ప‌ట్టుకుంటే ఆయ‌న‌కు పూన‌కం వ‌స్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన అన్ని ప‌థ‌కాల‌కు రేవంత్ రెడ్డి మంగ‌ళం పాడుతార‌ని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అర‌చేతిలో వైకుంఠం చూపెట్టారని విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఫ్రీ బ‌స్సుకు మంగ‌ళం పాడుతాని ఈ ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీకి రూ. 1400 కోట్ల న‌ష్టం వ‌చ్చిందని కేటీఆర్ చెప్పారు.  ఫార్మా సిటీ పెట్టాల‌ని రైతుల‌కు మంచి ప‌రిహారం ఇచ్చి భూసేక‌ర‌ణ చేశామని కానీ ఫార్మా సిటీని న‌డుపుకునే తెలివి కాంగ్రెస్ కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మైక్ ప‌ట్టుకుంటే ఆయ‌న‌కు పూన‌కం వ‌చ్చి.. ఏది ప‌డితే అది మాట్లాడుతాడు అని విమర్శించారు.