Mumbai: యువ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్..ముంబైలో ఫ్రీగా క్రికెట్ ట్రయల్స్

Mumbai: యువ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్..ముంబైలో ఫ్రీగా క్రికెట్ ట్రయల్స్

దేశంలో క్రికెట్ ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ గేమ్ ను కెరీర్ గా ఎంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. టాలెంట్ ఉన్నా అవకాశలు లేకపోవడంతో ఎంతో మంది నిరాశకు లోనవుతారు. ముఖ్యంగా ముంబై లాంటి పెద్ద నగరాల్లో క్రికెట్ ఛాన్స్ ల కోసం యువకులు అల్లాడిపోతారు. అయితే వీరందరికి ఒక గుడ్ న్యూస్. మీకు ప్రతిభ ఉంటే చాలు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ముంబైలో చక్కని అవకాశం కల్పించింది. 
    
మహారాష్ట్రలో ఆసక్తి ఉన్న యువ క్రికెటర్లు.. వాసూ పరాంజపే క్రికెట్ సెంటర్ నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ సెలక్షన్ ట్రయల్స్‌లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అద్భుతమైన అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ రెండు నగరాల్లో  నిర్వహించబడతాయి. బాంద్రాలోని వింగ్స్ స్పోర్ట్స్ సెంటర్ తో పాటు థానేలోని బెడేకర్ కాలేజ్ లో ట్రయల్స్ జరుగుతాయి. జనవరి 26, 27, 28 తేదీలలో మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తారు. 

వాసూ పరంజపే క్రికెట్ సెంటర్ యువ క్రికెట్ ప్రతిభను పెంపొందించడానికి.. క్రీడలో ఎదగడానికి కట్టుబడి ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్.. మెంటర్‌షిప్‌పై దృష్టి సారించి, అట్టడుగు స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ తర్వాతి తరం క్రికెట్ స్టార్‌లను గుర్తించి, వారిని తీర్చిదిద్దే కేంద్రం దృష్టికి అనుగుణంగా ఉంటుంది. అండర్ 14, అండర్ 16 మరియు అండర్ 19 కేటగిరీలలోని క్రికెటర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తారు.