FIFA World Cup 2026 Deliveroo Offer: ఫిఫా వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు.. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తాయి. టీవీల ముందు వాలిపోయి మ్యాచ్‌లు చూస్తూ, నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక క్రేజీ ముచ్చట తెగ ట్రెండ్ అవుతోంది. మీరు డెలివరూ (Deliveroo) యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు, డెలివరీ బాయ్ మీ ఇంటి బెల్ నొక్కిన కరెక్ట్ టైమ్‌కే మ్యాచ్‌లో గోల్ పడితే.. మీ ఫుడ్ బిల్ మొత్తం కంపెనీయే రిఫండ్ చేస్తుందట! అంటే పైసా కట్టకుండా బిర్యానీ ఫ్రీగా తినొచ్చన్న మాట. అయితే ఈ ముచ్చట వినడానికి బాగుండటంతో.. నెట్టింట జనాలు ఎగిరి గంతేస్తూ ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు. కానీ ఆగుండ్రి భాయ్ జర.. తొందరపడకండి! ఈ ఫ్రీ ఫుడ్ ముచ్చట పక్కా ఫేక్.
నమ్మితే మోసపోయినట్లే:
డెలివరూ కంపెనీ అలాంటి "డోర్‌స్టెప్ గోల్ రిఫండ్" పాలసీ లేదా ఆఫర్ ఏదీ పెట్టలేదు.. టోర్నమెంట్‌కు సంబంధించిన వాళ్ల అఫీషియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఎక్కడా ఈ విషయం చెప్పలేదు.. ఇదంతా సోసల్ మీడియాలో ఎవరో పుట్టించిన కట్టు కథ మాత్రమే. ఈ డెలివరూ, దాని పేరెంట్ కంపెనీ డోర్‌డ్యాష్ (DoorDash), వోల్ట్ (Wolt) అన్నీ కలిసి వరల్డ్ కప్ కోసం “Deliver Us to Fútbol” పేరుతో ఒక భారీ ఇంటర్నేషనల్ అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాయి. ప్రఖ్యాతి గాంచిన 'ట్రాక్టర్' (TRAKTOR) డైరెక్షన్‌లో ఒక సినిమా రేంజ్ యాడ్ తీశారు.
డోర్ తీసే టైమ్‌కే గోల్:
ఆ యాడ్‌లో ఏముందంటే.. ఒక డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి ఫుడ్ పట్టుకొని పోతాడు.. సరిగ్గా డోర్ తీసే టైమ్‌కే మ్యాచ్‌లో ఒక గోల్ పడుతుంది. దాంతో ఆ డెలివరీ బాయ్, కస్టమర్ ఇద్దరూ కలిసి పిచ్చెక్కిపోయి హగ్గులు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ యాడ్ చూసిన మన సోషల్ మీడియా మేధావులు.. ఓహో! డెలివరీ టైమ్‌కి గోల్ పడితే ఫుడ్ ఫ్రీ ఇస్తారేమోనని స్టోరీలు అల్లేసి నెట్టింట తెగ వైరల్ చేసేశారు.
అసలు ఆఫర్లు ఇవే:
* డోర్‌స్టెప్ గోల్ పడితే ఫ్రీ ఫుడ్ రాకపోవచ్చు కానీ, డెలివరూ నిజంగానే ఫ్యాన్స్ కోసం కొన్ని గట్టి ఆఫర్లనే అనౌన్స్ చేసింది.
* సమ్మర్ ఆఫ్ ప్లస్ (Summer of Plus): డెలివరూ ప్లస్ సబ్‌స్క్రైబర్ల కోసం టోర్నమెంట్ నడిచినన్ని రోజులు ఎక్స్‌క్లూజివ్ డీల్స్ ఉంటాయి.
* మ్యాచ్ డే BOGOF ఆఫర్స్: మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) లాంటి పెద్ద బ్రాండ్స్ నుంచి "బై వన్ గెట్ వన్ ఫ్రీ" (ఒకటి కొంటే ఒకటి ఫ్రీ) ఆఫర్లు లభిస్తాయి.
* రియాక్టివ్ ఫ్లాష్ డీల్స్ (Flash Deals): మ్యాచ్‌లో జరిగే లైవ్ సిట్యుయేషన్స్ బట్టి యాప్‌లో అప్పటికప్పుడు క్రేజీ డిస్కౌంట్లు, గ్రోసరీ బండిల్ ఆఫర్లు డిజైన్ చేస్తారు.
* బంపర్ లక్కీ డ్రా - వీఐపీ టికెట్లు: ప్రమోషన్ నడుస్తున్నప్పుడు ఆర్డర్ పెట్టే సబ్‌స్క్రైబర్లలో ఐదుగురు లక్కీ విన్నర్లకు VIP హాస్పిటాలిటీ ప్యాకేజీలు ఇస్తారు. ఇందులో మ్యాచ్ ఫ్రీ టికెట్లు, ఫ్లైట్ చార్జీలు, హోటల్ స్టే అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. కాబట్టి భాయ్స్.. డెలివరీ బాయ్ వచ్చేటప్పుడు నెట్ ఊగినా, గోల్ పడినా ఫుడ్ బిల్ మాత్రం మనమే కట్టాలి.. యాప్‌లో వచ్చే అసలైన డిస్కౌంట్లను వాడుకొని మ్యాచ్‌ను ఎంజాయ్ చేయండి.
