గండిపేట, వెలుగు: ఫ్రీ మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లీనిక్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభుకుమార్ తెలిపారు. మణికొండలోని లాంకో హిల్స్‌లో తమ హాస్పిటల్ఆవరణలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ఫ్రీ క్యాంపు ఉంటుందన్నారు. షుగర్ టెస్టులతోపాటు రూ.25 వేల విలువైన లివర్–ఫైబ్రో స్కాన్, తదితర పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి హజరుకానున్నట్లు తెలిపారు.
