బషీర్ బాగ్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కింగ్ కోఠిలోని కామినేని హాస్పిటల్లో వారం రోజుల పాటు మహిళలకు ఫ్రీగా మెడికల్ టెస్టులు చేస్తున్నట్లు హాస్పిటల్చైర్మన్ కామినేని సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 నుంచి 15 వరకు అన్ని రకాల టెస్టులు, స్కానింగ్లు ఫ్రీగా చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో కంప్లీట్ బ్లెడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, గైనకాలజీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ స్కానింగ్ లు ఉన్నాయి. అపాయింట్మెంట్ కోసం 78159 78159కు కాల్ చేయొచ్చన్నారు.
