మౌలాలిలోని ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు షురూ

మౌలాలిలోని ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు షురూ
  •     చీఫ్ గెస్ట్​గా డీజీపీ హాజరు

హైదరాబాద్​సిటీ,వెలుగు: రైల్వే ప్రొటెక్షన్  ఫోర్స్ (ఆర్​పీఎఫ్​) ఆధ్వర్యంలో 26వ అఖిల భారత పోలీస్  బ్యాండ్ పోటీ–2025  పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆల్  ఇండియా పోలీస్  స్పోర్ట్స్  కంట్రోల్  బోర్డు (ఏఐపీఎస్​సీబీ) సహకారంతో జరుగుతున్న ఈ పోటీలను మౌలాలిలోని ఆర్​పీఎఫ్​ ట్రైనింగ్​ సెంటర్​లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి ముఖ్య​అతిధిగా హాజరై పోటీలను ప్రారంభించారు. 

జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, వివిధ రాష్ట్ర పోలీసు విభాగాలు, రైల్వే ప్రొటెక్షన్  ఫోర్స్ కు చెందిన బ్యాండ్ బృందాలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. సంగీతంలో సమన్వయం, క్రమశిక్షణ, నైపుణ్యం ద్వారా భారత పోలీసు వ్యవస్థలోని ఐక్యత, సేవాభావాన్ని పోటీలు ప్రతిబింబించాయి. ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్‌‌‌‌‌‌‌‌లు, సీపీఓల నుంచి బృందాలు పాల్గొన్నాయి.