ఏపీలో సర్కార్ స్కూళ్ల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌

ఏపీలో సర్కార్ స్కూళ్ల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌
  • మహిళా దినోత్సవం సందర్భంగా పంపిణీకి శ్రీకారం
  • ప్రతి బాలికకు నెలకు 10 నేప్ కిన్స్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం జగన్ తన  క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు బాలికలకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికల వ్యక్తిగత ఆరోగ్యంపై అధికారులు, టీచర్లు మరింత శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు.  ఈనెల 8వ తేదీన (అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకం ప్రారంభించాలని సీఎం జగన్‌ తెలిపారు. వ్యవధి లేనందున ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలియజేశారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి అన్ని ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు.  ప్రతి బాలికకు నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ప్రభుత్వం‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం సుమారు రూ. 41.4 కోట్లు అంచనాతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించనున్నారు.

ఇవి కూడా చదవండి

పంత్ సూపర్ సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్

రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు

టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తే.. ప్రభుత్వాలు దిగొచ్చి ధరలు తగ్గిస్తాయి