పేద కుటుంబాలకు ఫ్రీగా సోలార్ రూఫ్స్

పేద కుటుంబాలకు ఫ్రీగా సోలార్ రూఫ్స్
  • అందజేసిన విశాక ఇండస్ట్రీస్‌

హైదరాబాద్‌‌, వెలుగు: వెనుకబడ్డ కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఆటమ్‌‌ (సోలార్‌‌ పవర్‌‌) రూఫ్స్‌‌ను మిర్యాలగూడకి చెందిన ఐదు పేద కుటుంబాలకు అందజేసింది. వీరికి ఇప్పటికీ కరెంటు సదుపాయమే లేదు.  కంపెనీకి మిర్యాలగూడలోనే ప్రొడక్షన్‌‌ యూనిట్‌‌  ఉంది. సోలార్‌‌ రూఫ్‌‌ ఉండటం వల్ల ఈ కుటుంబాలకు కరెంటు బిల్లు ఆదా కావడంతోపాటు పరిశుభ్రమైన విద్యుత్‌‌ లభిస్తుంది. ఆటమ్‌‌ రూఫ్స్‌‌ ద్వారా ఉచితంగా కరెంటు వస్తుంది కాబట్టి కరెంటు బిల్లు భారం ఉండదు. ప్రతి నెలా ఎంతో డబ్బును ఆదా చేసుకోవచ్చు. పూసలపహాడ్ గ్రామానికి పెద్దబోయిన లింగయ్య, గండ్రవారి గూడెం గ్రామనివాసి సంకమ్మరిడి కాంతమ్మ, పెద్ద దేవులపల్లి గ్రామంలో ఉండే బొల్లంపల్లి శ్రీకాంత్, అబంగపురం గ్రామవాసి కోరె శ్రీనివాస్, నంది పహాడ్ గ్రామంలో ఉంటున్న  కందుక్రి కళమ్మకు కిలోవాట్స్‌‌ కెపాసిటీ గల రూఫ్స్‌‌ అందజేశారు. లబ్దిదారులను గుర్తించడంతోపాటు నిర్మాణాన్ని పూర్తిచేసే బాధ్యతను విశాక ఇండస్ట్రీసే తీసుకుంది.  సోలార్ రూఫ్ ఫాబ్రికేషన్ కోసం రూ.65 వేలు ఖర్చు చేశామని కంపెనీ తెలిపింది-. ఈ రూఫ్‌‌ అదనపు గదిగానూ ఉపయోగపడుతుంది. ఇందులోని బ్యాటరీలు ఆటమ్‌‌ సోలార్ రూఫ్, సోలార్ ప్యానల్ నుంచి ఉత్పత్తయే కరెంటును నిల్వచేసుకుంటాయి.  
ఇతర రాష్ట్రాల్లోనూ...
తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని తమ ప్లాంట్ల సమీపంలోని పేద కుటుంబాలకు కూడా కిలోవాట్‌‌ సోలార్ రూఫ్స్ ని అందిస్తామని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డమ్‌‌ వంశీ అన్నారు “ గ్రామాలకు క్లీన్‌‌ ఎనర్జీని అందించడంలో ఇదొక చిన్న అడుగు. దేశ అభివృద్ధి కోసం మరిన్ని గ్రీన్ టెక్నాలజీల మీద మేం ఫోకస్‌‌ చేస్తాం. మా కలలకు ఆటమ్‌‌ సోలార్ రూఫ్ బలాన్నిస్తోంది. పర్యావరణాన్ని కాపాడే ప్రొడక్టుల తయారీకి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన వివరించారు.   సాధారణ సోలార్ ప్యానెల్ తో పోల్చి చూస్తే ఆటమ్‌‌ 20-–40 శాతం ఎక్కువ పవర్‌‌ను తయారు చేస్తుంది. ఇందుకోసం పెట్టిన ఖర్చును కస్టమర్‌‌ నాలుగు సంవత్సరాల లోపులోనే తిరిగి పొందవచ్చు. మరో 25 సంవత్సరాల వరకు ఉచితంగా కరెంటును పొందవచ్చు. ఆటమ్‌‌ సోలార్ రూఫ్‌‌కు 20 సంవత్సరాల పేటెంట్ ఉందని వంశీ వివరించారు. విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌ను 1981లో స్థాపించారు.  సిమెంట్ రూఫింగ్ షీట్స్ ప్రొడక్షన్‌‌లో ఈ కంపెనీ దేశంలోనే రెండో అతిపెద్ద సంస్థ. కారుగేటెడ్ సిమెంటు షీట్లు మొదలుకొని ఫైబర్ సిమెంటు బోర్డులు, హైబ్రిడ్ సోలార్ రూఫ్స్,  వండర్ ల్యాండ్ యార్న్  వంటి ప్రొడక్టులు తయారు చేస్తుంది. కంపెనీకి 12 ప్రొడక్షన్‌‌ యూనిట్లు ఉన్నాయి. 13 మార్కెటింగ్ ఆఫీసులతోపాటు దేశవ్యాప్తంగా ఏడు వేల మంది డీలర్లు ఉన్నారు.