కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ.5 వేల 423 కోట్లు

కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ.5 వేల 423 కోట్లు

న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో 10 శాతం వృద్ధితో రూ.5,423 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే సమయంలో లాభం రూ.4,933 కోట్లుగా ఉంది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 13 శాతం పెరిగి రూ.4,027 కోట్లకు చేరింది. 

బ్యాంకు వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధి చెంది రూ.7,876 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) డిసెంబర్ క్వార్టర్​లో ఉన్న 4.54 శాతం నుంచి 4.67 శాతానికి మెరుగుపడింది. గతేడాది నాలుగో క్వార్టర్​లో ఉన్న 4.97 శాతంతో పోలిస్తే ఇది తగ్గింది.

2026 మార్చి 31 నాటికి నికర అడ్వాన్సులు 16 శాతం పెరిగి రూ.4.96 లక్షల కోట్లకు చేరాయి. కస్టమర్ ఆస్తుల విలువ రూ.5.46 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇది రూ.4.78 లక్షల కోట్లుగా ఉండేది. బ్యాంకు డిపాజిట్లు 15 శాతం వృద్ధితో రూ.5.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సగటు డిపాజిట్లు కూడా 15 శాతం పెరిగి రూ.5.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సగటు కరెంట్ డిపాజిట్లు 18 శాతం పెరిగి రూ.77,058 కోట్లకు చేరాయి.