
వికారాబాద్, వెలుగు: సాఫ్ట్స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మాక్ ఇంటర్వ్యూ, మెంటల్ వెల్ బియింగ్ తదితర అంశాల్లో ఎంబీసీలకు నాలుగురోజుల పాటు హైదరాబాద్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్ తెలిపారు. ట్రైనింగ్లోఅభ్యర్థులకు ట్రావెలింగ్ అలవెన్స్, భోజనం, వసతి సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలన్నారు.
ఆధార్ కార్డు, కుల, ఆదాయ సర్టిఫికెట్లతో ఈ నెల 16 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంబీసీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.