పీడీవో, పీడీవోఏ, యాప్ ప్రొవైడర్ల ద్వారా సేవలు
ఫీజు లేకుండానే వాటికి అనుమతులు
కొత్త కొలువులకు రూ.22,810 కోట్లు కేటాయింపు
కొచ్చి–లక్షద్వీప్ మధ్య ఆప్టిక్ ఫైబర్ కనెక్టివిటీ
బీఎస్ఎన్ఎల్కు పనులు అప్పగింత
కొన్ని రోజుల్లో జనానికి ఫ్రీ వైఫై అందుబాటు లోకి రానుంది. ‘పీఎం వాణి’ అనే కొత్త స్కీమ్కింద కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్లేసెస్‌లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఎలాంటి లైసెన్స్‌లు, ఫీజు, రిజిస్ట్రేషన్లు లేకుండానే ఈ సౌకర్యం కల్పించనుంది. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పీడీవో, పీడీవోఏ, యాప్ ప్రొవైడర్ల ద్వారా సేవలు
ఫీజు లేకుండానే పర్మిషన్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఇంటర్నెట్ సౌలతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. జనానికి ఫ్రీగా వైఫైని అందించబోతోంది. ‘పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్)’ అనే కొత్త స్కీం కింద పబ్లిక్ ప్లేసెస్‌లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పీఎం వాణితో పాటు మరికొన్ని అంశాలకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం వాణిలో భాగంగా ఎలాంటి లైసెన్స్‌లు, ఫీజు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వైఫై సౌకర్యాలను కల్పించనుంది.
మూడు అంచెలుగా..
ఫ్రీ వైఫై సేవలను కేంద్రం మూడు అంచెలుగా అందించనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీవో), పబ్లిక్ డేటా ఆఫీస్అగ్రిగేటర్స్(పీడీవోఏ), యాప్ ప్రొవైడర్లను ఏర్పాటు చేయనుంది. వైఫై యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, ఆపరేషన్లను పీడీవోలు చూస్తాయి. జనాలకు నెట్ సర్వీసులను అందిస్తాయి. పీడీవోలకు మధ్యవర్తులుగా పీడీవోఏలు పనిచేస్తాయి. ఆథరైజేషన్, అకౌంటింగ్ వంటి వ్యవహారాలను చూస్తాయి. జనాలు నెట్ సౌకర్యం పొందేలా యాప్‌లను డెవలప్ చేయడం, వైఫై హాట్‌స్పాట్స్‌ను గుర్తించడం వంటి పనులను యాప్ప్రొవైడర్లు చూసుకుంటారు. పీడీవో, పీడీవోఏ, యాప్ ప్రొవైడర్ల వివరాలను సెంట్రల్ టెలికాం డిపార్ట్మెంట్(సీడాట్) ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ రిజిస్ట్రీ మెయింటెయిన్ చేస్తుంది. పీడీవోలు చిన్న చిన్న షాపులు, కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా ఏర్పాటు చేసుకునే వీలుంటుందని కమ్యూనికేషన్స్ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్ చెప్పారు.
కొలువులకు రూ.22,810 కోట్లు
కొలువుల భర్తీకి బూస్ట్నిచ్చేందుకూ కేంద్రం సంకల్పించింది. నిరుద్యోగులకు జాబ్స్ ఇచ్చేలా కంపెనీలను ఎంకరేజ్ చేసేందుకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన(ఏబీఆర్‌వై) కింద రూ.22,810 కోట్లను కేటాయించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్3.0ను ప్రకటించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నిధులను 2020–2023 వరకు మూడేళ్ల కాలానికిగానూ వాడుకోవాలంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించింది. స్కీంలో భాగంగా 2020 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 మధ్య కొత్తగా తీసుకున్న ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు.

