ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి సినర్‌‌‌‌‌‌‌‌, జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌

ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి సినర్‌‌‌‌‌‌‌‌, జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌
  • గాఫ్​, పెగులా, ఆండ్రీవా కూడా
  • బోపన్న జోడీ ముందంజ

పారిస్‌‌‌‌‌‌‌‌: ఇటలీ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ జానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ 6–0, 6–1, 6–2తో జిరి లెహెక (చెక్‌‌‌‌‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. దీంతో గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌లో తన వరుస విజయాల సంఖ్యను 17కు పెంచుకున్నాడు. గంటా 34 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించిన సినర్‌‌‌‌‌‌‌‌.. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో అతి తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నాడు. 31 విన్నర్లు కొట్టిన సినర్‌‌‌‌‌‌‌‌ 9 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేశాడు.

ఈ క్రమంలో వచ్చిన 18 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఏడింటిని సద్వినియోగం చేసుకున్నాడు. లెహెక కొట్టిన ఒక్క బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకున్నాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో వరుసగా 11 గేమ్‌‌‌‌‌‌‌‌లు గెలవడంతో స్కోరు 6–0, 5–1గా మారింది. తర్వాత లెహెక పుంజుకునే ప్రయత్నం చేసినా సినర్‌‌‌‌‌‌‌‌ భారీ సర్వ్‌‌‌‌‌‌‌‌ల ముందు నిలవలేకపోయాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) 6–2, 7–6 (7/4), 6–1తో కోబలి (ఇటలీ)పై, డ్రాపర్‌‌‌‌‌‌‌‌ (బ్రిటన్‌‌‌‌‌‌‌‌) 6–2, 6–4, 6–2తో ఫోన్సెకా (గ్రీస్‌‌‌‌‌‌‌‌)పై, అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ బుబ్లిక్‌‌‌‌‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) 7–5, 6–1, 6–2తో హెన్రిక్‌‌‌‌‌‌‌‌ రోచా (పోర్చుగల్‌‌‌‌‌‌‌‌)పై, టాలన్‌‌‌‌‌‌‌‌ గ్రీక్స్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌) 4–6, 6–1, 6–7 (2/7), 6–1, 6–4తో క్విన్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై గెలిచి ముందంజ వేశారు.

విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ పెగులా (అమెరికా) 3–6, 6–4, 6–2తో వోండ్రుసోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై, ఆండ్రీవా (రష్యా) 6–3, 6–1తో యూలియా పుతినెత్సోవా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై, కసాట్కినా (ఆస్ట్రేలియా) 6–1, 7–5తో బడోసా (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. రెండో సీడ్    కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–1, 7–6 (7/3) బౌజుకోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై, ఏడో సీడ్  మాడిసన్‌‌‌‌‌‌‌‌ కీస్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)4–6, 6–3, 7–5తో  కెనిన్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. ఇక మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు చెందిన శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ బాలాజీ–మిగుయెల్‌‌‌‌‌‌‌‌ రీస్‌‌‌‌‌‌‌‌ వారెలా (మెక్సికో) 3–6, 4–6తో నాలుగో సీడ్ ఇటలీ జంట బోలెలి–వావసోరి చేతిలో ఓడారు. రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న (ఇండియా)–ఆడమ్‌‌‌‌‌‌‌‌ పావ్లాసెక్‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌) 6–7 (2/7), 7–6 (7/5), 6–2తో సాడియో డౌంబియా–ఫ్యాబియన్‌‌‌‌‌‌‌‌ రిబౌల్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు.