ఫ్రాన్స్ అధ్యక్షుడిపై టమోటాలు విసిరిన దుండగులు

ఫ్రాన్స్ అధ్యక్షుడిపై టమోటాలు విసిరిన దుండగులు

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారి మాక్రాన్ ప్రజల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించడానికి ఫ్రాన్స్ ప్రజలు ఆయన్ను చుట్టుముట్టారు. వారితో మాట్లాడుతుండగా.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలు విసిరారు. వెంటనే అప్రమత్తమైన మాక్రాన్ సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను చుట్టూ చేరి రక్షణ వలయంగా మారారు. అనంతరం మాక్రాన్ ను అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

2017లో జరిగిన ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మళ్లీ 2022 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి మారిన్ లె పెన్ పై విజయం సాధించి మాక్రాన్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. జాక్వలిస్ చిరాక్ (2002) తర్వాత ఫ్రాన్స్ కు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రికార్డు సృష్టించారు.

మరిన్ని వార్తల కోసం...

కాందహార్ లో ఆహరం కోసం జనం బారులు 

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి ఎక్కడ?