తక్కువ టైంలోనే అందంగా కనిపించాలంటే..

 తక్కువ టైంలోనే అందంగా కనిపించాలంటే..

ఫేస్​ప్యాక్​లు తయారు చేసుకునేంత టైం ఉండదు ఒక్కోసారి. అలాంటప్పుడు తక్కువ టైంలోనే అందంగా కనిపించేందుకు ఏం చేయాలంటే....    కొద్దిగా ఆలివ్​ ఆయిల్​ని చర్మానికి రుద్దుకోవాలి. దాంతో చర్మరంధ్రాల్లో చేరిన మురికి పోతుంది. చర్మం ఫ్రెష్​గా కనిపిస్తుంది.  బ్లాంటింగ్​ పేపర్స్​గా కాఫీ ఫిల్టర్స్​  చక్కగా పనికొస్తాయి. బ్లాటింగ్​ పేపర్ తయారీకి వాడే మెటీరియల్​తోనే వీటిని తయారుచేస్తారు. కాఫీ పొడి, ఆలివ్​ ఆయిల్​తో​ స్క్రబ్​ తయారుచేసుకోవాలి. ఈ స్ర్కబ్​ స్ట్రెచ్​ మార్క్​లని పోగొడుతుంది.    ఓట్స్​లోని ఫ్యాట్​, షుగర్​ చర్మానికి మాయిశ్చరైజర్​గా పనిచేస్తాయి. ఓట్​మీల్​ మాస్క్​ని చర్మానికి రాసుకుంటే దురద, సన్​బర్న్​ తగ్గిపోతాయి.    చల్లని గ్రీన్​ టీ బ్యాగ్​ని కళ్ల కింద అయిదు నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్ల అలసటను తగ్గుతుంది. అవకాడోలో ఉండే అన్​శ్యాచురేటెడ్​ ఆయిల్​ జుట్టుని మాయిశ్చరైజ్​ చేస్తుంది. ఒక మీడియం సైజ్​ అవకాడోని పేస్ట్​ చేసి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్​ ఆయిల్​ కలపాలి. ఈ ప్యాక్​ని పొడి జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత 
శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలకి పోషణ అంది, బలంగా మారతాయి.