బాకీ తీర్చమన్నందుకు వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపిన స్నేహితులు

V6 Velugu Posted on Aug 22, 2021

ఇచ్చిన బాకీ తీర్చమన్నందుకు ఓ వ్యక్తిని అతని స్నేహితులే  కిడ్నాప్ చేసి చంపిన ఘటన ఓల్డ్ సిటీలో జరిగింది. చార్మినార్ కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డి తన స్నేహితులకు రూ. 40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత మధుసూదన్ రెడ్డి అప్పు తీర్చాలని స్నేహితుల మీద ఒత్తిడితెచ్చాడు. దాంతో వారంతా ఎలాగైనా మధుసూదన్ రెడ్డిన అంతమొందించాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా.. ఈ నెల 19న మధుసూదన్ రెడ్డిని చార్మినార్ లో కిడ్నాప్ చేశారు. అనంతరం సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడ హత్యచేసి.. పొలంలో పాతిపెట్టారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం బయటకొచ్చింది. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు.

Tagged Hyderabad, murder, crime, debt, friends, charminar, Businessman Madhusudhan Reddy

Latest Videos

Subscribe Now

More News